Election Code 2024: దేశంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ మొత్తం 7 విడతల్లో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడతలో అంటే మే 13న జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పలు జాతీయ స్థాయి పరీక్షలు, రాష్ట్ర స్థాయి పరీక్షలు వాయిదా పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జాతీయ స్థాయిలో జరగాల్సిన ప్రవేశ పరీక్షల తేదీ మారింది. జేఈఈ మెయిన్స్ 2024 రెండవ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి 15 వరకూ జరగాల్సి ఉండగా 12వ తేదీకే ముగియనున్నాయి. ఇక ఎంహెచ్ టీసెట్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరగాల్సి ఉంటే మే 2 నుంచి 17 వరకూ జరగనున్నాయి. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు మే 26న జరగాల్సి ఉండగా కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 16న జరుగుతుంది. నీట్ పీజీ 2024 పరీక్ష జూన్ 23న జరగాల్సి ఉంది. ఈ పరీక్షను జూలై 15కు వాయిదా వేయవచ్చు. ఇక సీఏ గ్రూప్ 1 పరీక్షలు మే 3,5,9 తేదీల్లో జరగాల్సి ఉండగా మే 11, 12, 17తేదీల్లో జరగనున్నాయి. సీయూఈటీ పరీక్షలు మే 15, 31 తేదీల్లో జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. కొత్త తేదీ ఇంకా ఖరారు కాలేదు. 


మరోవైపు టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షలు ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, తిరిగి మద్యాహ్నం 3 గంటల్నించి 6 గంటల వరకూ జరగనున్నాయి. టీఎస్ పోలీసెట్ 2024 పరీక్ష మే 17 న జరగాల్సి ఉంటే మే 24కు వాయిదా పడింది. 


ఇక ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు మే 16, 22 తేదీల్లో జరగనున్నాయి. మార్చ్ 30 నుంచి ప్రారంభం కావల్సిన ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేశాకే తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు.


Also read: Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామం, ఆప్ ఎమ్మెల్యేలతో సునీతా కేజ్రీవాల్ భేటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook