Ec to announces poll schedule of Maharashtra and Jharkhand: ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహిస్తు వస్తుంది . దీంతో మరోసారి దేశంలో ఎన్నికల పండుగ వచ్చిందని చెప్పుకొవచ్చు. అయితే.. మళ్లీ ఎన్నికల శంఖారావం పూరించడానికి కేంద్రం ఎన్నికల సంఘం సిద్దమైంది. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు చోట్ల ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధిచిన షెడ్యూల్ ను ఈసీ మధ్యాహ్నం మీడియా సమావేశంలో వెల్లడించనుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మరోవైపు.. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ పదవీకాలం నవంబరు 26 తో ముగియనుంది. అదే విధంగా 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రం పదవీ కాలం జనవరి 5, 2025 తో ముగియనుంది. ఇంకా కొన్నిస్థానాల్లో ఉప ఎన్నికలు కూడాజరగనున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తుండటంతో రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకొవచ్చు.


మహారాష్ట్రలో ఎన్నికల వేళ బాబా సిద్దీఖీ ఘటన పెనుదుమారంగా మారింది. దీంతో ఒక వైపు కేంద్రం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్న నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయినట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ హల్ చల్ తో మహారాష్ట్ర ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. ఏక్ నాథ్ షిండే సర్కారు మాత్రం..ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. 


Read more: Muthyalamma Temple: రంగంలోకి దిగిన అమిత్‌షా..?.. ముత్యాలమ్మ విగ్రహాం ఘటనపై సీరియస్.. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter