Election Results 2024: ఓట్ల లెక్కింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..
Election Results 2024: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఏడో విడత ఎన్నికలతో ముగిసింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు.. జూన్ 1న జరిగిన ఏడో విడతలతో పూర్తయింది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఈ సందర్భంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపుపై కీలక ప్రకటన చేసింది.
Election Results 2024: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహించడం అంటే మామలు విషయం కాదు. దేశానికి కాబోయే ప్రధాన మంత్రిని ఎన్నుకునే ఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్స్ పై దేశ వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా అందరి కళ్లు ఈ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమైన ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 4వ తేదిన ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటర్లు దేశ వ్యాప్తంగా తమకు కాబోయే నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసారు. ఇక ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది ఎన్నికల కమిషన్.
దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు గాను సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో జూన్ 4వ తేదిన 542 లోక్ సభ సీట్లకు సంబంధించి ఎన్నికల ఫలితలను ఈసీ ప్రకటించనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదిన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అరుణాల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల శాసన సభ స్థానాలకు ఎన్నికల జరిగాయి. వాటికి సంబంధించిన లెక్కింపు కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధుతో కలిసి ఓట్ల లెక్కింపు పై వివిధ రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహించింది. ఎన్నికల ఫలితాలను ఎప్పటికపుడు ఓటరు హెల్ఫ్ లైన్ యాప్ iOS, Android మొబైల్ యాప్ లలో అందుబాటులో ఎప్పటి కపుడు ఫలితాలను సామాన్య ప్రజలు కూడా చూసి తెలుసుకోవచ్చని చెప్పింది.
వినియోగాదారులు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఎవరు గెలిచారానే విషయాలను తెలుసుకోవచ్చని చెప్పుకొచ్చింది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు .. దేశంలో మోదీ 3.O ఖాయమనే సంకేతాలు ఇచ్చాయి. మరి ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే ఎన్నికలు ఫలితాలు ఉంటాయా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్.. కారు షెడ్డుకే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook