కేరళ: వయనాడ్‌ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అక్కడ  ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధిపై లక్షా 9 వేల ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తెలిసింది. వయనాడ్‌ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తోంది. దీంతో దక్షిణాది నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన రాహుల్‌ వయనాడ్‌ను ఎంచుకున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమేథిలో వెనుకంజ...


మరోవైపు కాంగ్రెస్‌ కంచుకోట అయిన యూపీలోని అమేథీలో మాత్రం రాహుల్‌ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ భాజపా నేత స్మృతి ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  పయానాడ్ నుంచి  బరిలోకి దిగడంతో రాహుల్ అమేథీ గెలుపుపై ప్రభావం చూపించింది.  వయనాడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో రాహుల్‌ అమేఠీ ప్రజలకు అందుబాటులో లేకపోయారు. దీంతో అక్కడి ఓటర్లు స్మృతి ఇరానీకి మొగ్గు చూపినట్లు కన్పిస్తోంది. 


ప్రయోగం విఫలం...


రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీతో పాటు దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. వయనాడ్ నుంచి పోటీ చేస్తే ఆది దక్షిణాదిన ప్రభావం ఉటుందనే వ్యూహంతో రాహుల్ ఇలాంటి ప్రయోగం చేశారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం అమేథీలో మాత్రం ఇంకా వెనుకంజలో ఉంటూ వయనాడ్‌  విజయం సాధించడం  గమనార్హం