Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక నేతలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మొన్న రెండు దఫాలుగా శరద్ పవార్‌తో సమావేశం..ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ, ప్రియాంకాలతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌కు(Prashant kishor) దేశంలో మంచి పేరుంది. వివిధ రాజకీయ పార్టీలకు విజయాన్ని సాధించిపెట్టిన పీకే..తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తన సత్తా చూపించారు. ఆ తరువాత దేశంలోని కీలక నేతల్ని కలుస్తూ సంచలనం కల్గిస్తున్నారు. ఎన్సీపీ నేత శరద్ పవార్‌(Sharad pawar)తో రెండు సార్లు సమావేశమై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. దేశంలో బీజేపీకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి. మూడవ ఫ్రంట్‌కు శరద్ పవార్ నేతృత్వం వహించవచ్చని సమాచారం. రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీ(Priyanka gandhi)లతో ప్రశాంత్ కిశోర్ ఏం చర్చించారనేది బయటకు రాకపోయినా..థర్డ్‌ఫ్రంట్‌లో కాంగ్రెస్ పార్టీ చేరేలా ఒప్పించే ప్రయత్నం చేసి ఉండవచ్చని తెలుస్తోంది. 


వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల(Uttar pradesh Elections) విషయమైన చర్చించారని మరో వాదన విన్పిస్తోంది. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే కాంగ్రెస్ పార్టీకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను యూపీ ముఖ్యమంత్రిగా ప్రకటించే విషయంలో కీలక పాత్ర పోషించారు. అన్ని ఎన్నికల్లోనూ తన సత్తా చాటుతూ వచ్చిన పీకే..గత యూపీ ఎన్నికల్లో మాత్రం విఫలమయ్యారు. ఏదైమైనా ప్రశాంత్ కిశోర్ భేటీ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 


Also read: Parliament Monsoon Sessions: జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్‌లపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook