Parliament Monsoon Sessions: జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్ మరోసారి తెరపైకొస్తున్నాయి. దేశమంతా ఒకే సివిల్ కోడ్ అమలు, జనాభా నియంత్రణలో భాగంగా పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశాలున్నాయా..
రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions) హాట్‌హాట్‌గా జరగనున్నాయి. కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్ అంశాలపై వాగ్వాదాలు జరిగే అవకాశాలున్నాయి. దీనికి కారణం ఈ రెండు అంశాలపై ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తుండటమే. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ(Population control bill) ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడం, అసోం సైతం ఆ ఆలోచనలో ఉండటంతో పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టాలనేది బీజేపీ ఎంపీల ఆలోచనగా ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ రవి కిషన్ జనాభా నియంత్రణ బిల్లును, రాజస్థాన్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కిరోరి లాల్ మీనా..యూసీసీ బిల్లును (Union Civil Code Bill) జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇంకొందరు ఎంపీలు కూడా ఈ రెండు అంశాలపై నోటీసులిచ్చారు.
మంత్రులు ప్రవేశపెట్టేవి కాకుండా ఎంపీలు ప్రవేశపెడితే ప్రైవేటు బిల్లులుగా(Private Bills) వ్యవహరిస్తారు. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే సంపూర్ణ మెజార్టీ అవసరం. అందుకే సాధారణంగా ప్రైవేటు బిల్లలు ఎప్పుడూ చట్టరూపం దాల్చవు. 1970 తరువాత ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్(Parliament)లో ఆమోదం పొందలేదు. ఈ బిల్లులు ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న ప్రయత్నాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ అనుబంధమైన విశ్వహిందూ పరిషత్ కూడా ఈ బిల్లులో ఉన్న ఏక సంతాన నిబంధనను వ్యతిరేకిస్తోంది. బిల్లులోని కొన్ని క్లాజులపై అభ్యంతరాలున్నాయని..దీనివల్ల హిందూ ముస్లిం జనాభాలో అసమతుల్యత పెరుగుతుందని చెబుతోంది విశ్వహిందూ పరిషత్(Viswa Hindu Parishad).
Also read: Sputnik v vaccine: త్వరలో స్పుత్నిక్ వి కమర్షియల్ లాంచ్ : డాక్టర్ రెడ్డీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook