Suman Bery: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా సుమన్ బేరీ.. రాజీవ్ కుమార్ స్థానంలో బాధ్యతల స్వీకరణ!
Suman Bery: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ కుమార్ స్థానంలో బేరీని నియమించింది కేంద్రం.
Niti Aayog Vice Chairman: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త సుమన్ బేరీ (Suman Bery) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ కుమార్ స్థానంలో ఆయన నూతన వీసీగా నియమితులైన సంగతి తెలిసిందే. బేరీ..గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా మరియు రాయల్ డచ్ షెల్ యొక్క గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. అతను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడు. వరల్డ్ బ్యాంక్‌కు కూడా బేరీ సేవలు అందించారు.
కేంద్రం తనకు అప్పగించిన ఈ బాధ్యతలను గౌరవంగా భావిస్తున్నట్లు బేరీ చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధిలో నీతి అయోగ్ తనదైన పాత్ర పోషించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అరవింద్ పనగారియా స్థానంలో.. రాజీవ్ కుమార్ (Rajiv Kumar) 2017లో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజే నూతన విదేశాంగ కార్యదర్శిగా వినయ్ క్వాత్ర (Vinay Mohan Kwatra) బాధ్యతలు స్వీకరించారు. హర్షవర్థన్ శ్రింగ్లా స్థానంలో ఆయన బాధ్యతలు చెపట్టారు. వినయ్ క్వత్రా..భారత విదేశాంగ శాఖ 34వ కార్యదర్శి. ప్రధాని మోదీ యూరోప్ పర్యటనకు ఒక రోజు ముందే వినయ్ క్వత్రా బాధ్యతలు తీసుకోవడం విశేషం.
Also Read: Vinay Mohan Kwatra: నూతన విదేశాంగ కార్యదర్శిగా వినయ్ క్వత్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.