EMRS Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం గిరిజన మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మొత్తం 3,479 పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులతో పాటు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం పోస్టులలో ఏపీ నుంచి 117, తెలంగాణ నుంచి 262 ఖాళీలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్  https://tribal.nic.in/ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.


Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం


మొత్తం పోస్టులు 3479 ఉండగా, అందులో ప్రిన్సిపాల్ పోస్టులు 175 ఉన్నాయి. వైస్ ప్రిన్సిపాల్ 116 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1,244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 1,944 ఖాళీలున్నాయి. తెలుగు రాష్ట్రాల పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 117 పోస్టులుండగా అందులో ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6 పోస్టులు, టీజీటీ ఖాళీలు 97 ఉన్నాయి. 


తెలంగాణలో మొత్తం 262 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపాల్- 6 పోస్టులు, పీజీటీ పోస్టులు 77, టీజీటీ ఖాళీలు 168 ఉన్నాయి. అత్యధికంగా మధ్య ప్రదేశ్ కోటాలో 1,279 పోస్టులుండగా, చత్తీస్‌గఢ్- 514 రాజస్తాన్- 316 ఖాళీలుండగా, అత్యల్పంగా ఉత్తరాఖండ్- 9, మిజోరం- 10 పోస్టులున్నాయి.


Also Read: Xiaomi Mi 11: మార్చి 29న లాంఛింగ్‌కు సిద్ధంగా ఎంఐ 11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు


ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఆపై ఇంటర్వ్యూ
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం
దరఖాస్తు తుది గడువు: ఏప్రిల్ 30న ముగియనుంది


ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ వెబ్‌సైట్‌: https://tribal.nic.in/


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook