Roshni Ali dance on Live TV debate: ఇటీవలి కాలంలో టీవీ డిబేట్‌ (TV Debate)లు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖులు ఏదో ఒక అంశం పైన మాట్లాడటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. డిబేట్‌కు వచ్చిన వారు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అందరూ తమ అభిప్రాయమే నెగ్గాలని చూస్తుంటారు. ఈ క్రమంలో డిబేట్‌లో పాల్గొన్న మిగతా వారు మాట్లాడకుండా అడ్డు పడతారు. ఒక్కో సమయంలో ప్యానెన్‌లో కూర్చున్న వ్యక్తులు ఒకరిపైన ఒకరు అరుచుకుంటారు కూడా. ఒక్కోసారి ఒకరినొకరు కొట్టుకుంటారు కూడా. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఓ యువతి చేసిన పని ప్రస్తుతం నెట్టింట నవ్వులు పోయిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విషయంలోకి వెళితే... గత దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చాలా? వద్దా? అని బెంగాలీ న్యూస్ ఛానల్ (Bengali NEWS Channel) రిపబ్లిక్ బంగ్లా ఓ డిబేట్‌ నిర్వహించింది. ఈ డిబేట్‌కు పర్యావరణ కార్యకర్త రోష్నీ అలీ (Roshni Ali) మాట్లాడడానికి వచ్చారు. రోష్నీ అలీతో పాటు మరో ఐదుగురు మధ్య డిబేట్‌ మొదలైంది. అందరూ తమ తమ అభిప్రాయం వినిపిస్తున్నారు. రోష్నీ అలీ తప్ప మిగతావారు గట్టిగా మాట్లాడుతున్నారు. అలీ మాట్లాడడానికి ప్రయతించినా.. మిగతావారు వెనక్కితగ్గలేదు. యాంకర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. దాంతో రోష్నీ అలీ నిరాశకు గురయ్యారు. 


Also Read: Malaika Arora Braless: బ్రాలెస్‌గా బయటికొచ్చేసిన మలైకా అరోరా.. ముంబై వీధుల్లో చక్కర్లు!!


డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అందరిని ఆకర్షించేందుకు రోష్నీ అలీ వినూత్నంగా ఆలోచించారు. లైవ్ జరుగుతుండగానే డాన్స్ (Roshni Ali Dance) చేశారు. తాను కూర్చుకున్న చోటనే చేతులతో డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరించారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో పాతది అయినప్పటికీ.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోష్నీ అలీ చేసిన డాన్స్ నెటిజన్లకు నవ్వులు కురిపిస్తుంది.



కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి సమయంలో పటాకులను నిషేధించాలని కోరుతూ రోష్నీ అలీ కలకత్తా హైకోర్టులో గతేడాది నవంబర్ మాసంలో పిల్ దాఖలు చేశారు. పటాకులు కాల్చడం వలన పర్యావరణం పాడవుతుందని, కరోనా రోగులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని కలకత్తా హైకోర్టులో వాదించారు. ఈ విషయంపైనే సదరు బెంగాళీ న్యూస్ ఛానెల్ డిబేట్ నిర్వహించిన క్రమంలో ఈ ఫన్నీ సీన్ జరిగింది. దీనిపై నెటిజెన్ల పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.వీడియో చూసి మీరు నవ్వుకోండి. 


Also Read: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇండియన్ బిజినెస్ టైకూన్ ఎవరో గుర్తుపట్టగలరా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook