EPF Medical Advance: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త. వైద్య అవసరాల నిమిత్తం మెడికల్ అడ్వాన్స్ ఇస్తోంది. అర్హులైన సభ్యులు లక్ష రూపాయల వరకూ నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌లో(EPFO) రిజిస్టరైన ఉద్యోగులకు ఇది గుడ్‌న్యూస్. వైద్య అవసరాల కోసం లక్ష రూపాయల వరకూ విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కలుగుతోంది. ఉద్యోగులు ఈ అడ్వాన్స్ కోసం ఎటువంటి ఆసుపత్రి బిల్లుల్ని సమర్పించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్ నియమాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. 


నిబంధనల ప్రకారం ముందుగా రోగిని ప్రభుత్వ లేదా పీఎస్‌యూ లేదా సీజీహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. రోగిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చితే ఒక అధికారి వివరాల్ని పరిశీలించిన అనంతరం మంజూరవుతుంది. ఉద్యోగి లేదా కుటుంబం అడ్వాన్స్ క్లెయిమ్ కోసం  ఆసుపత్రి, రోగి వివరాల్ని తెలియజేస్తూ ఓ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులో బిల్లు అంచనా రాయాల్సిన అవసరం లేదు. రోగి కుటుంబానికి ఈ డబ్బు అడ్వాన్స్‌గా(Medical Advance)ఇవ్వవచ్చు లేదా రోగిని చేర్చిన ఆసుపత్రికి నేరుగా చెల్లించే అవకాశముంది. ఒకవేళ చికిత్స బిల్లు లక్ష పరిమితిని దాటితే మరోసారి అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవసారి అడ్వాన్స్ కోసం మాత్రం ఆసుపత్రిలో అంచనా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. రోగి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులు(Medical Bills)ఈపీఎఫ్‌కు సమర్పించాలి.


Also read: Disha Bills: కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉన్న ప్రతిష్ఠాత్మక దిశ బిల్లులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook