EPFO Account: అడ్వాన్స్ పీఎఫ్ డబ్బులు ఆన్లైన్లో ఎలా విత్ డ్రా చేసుకోవాలి
EPFO Account: ప్రభుత్వ ఉద్యోగైనా లేక ప్రైవేట్ ఉద్యోగైనా ప్రతి ఒక్కరికీ పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. మీ జీతం నుంచి కొంతభాగం, పనిచేసే సంస్థ నుంచి కొంతభాగం ప్రతి నెలా మీ పీఎఫ్ ఎక్కౌంట్లో జమ అవుతుంటుంది. రిటైర్మెంట్ తరువాత లేదా ఆ ఉద్యోగం వదిలినప్పుడు పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి.
EPFO Account: ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారినప్పుడు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం లేదా మరో కంపెనీకు బదిలీ చేసుకోవడం చేసుకోవచ్చు. మధ్యలో ఎప్పుడైనా అవసరం వస్తే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు గానీ దీనికి కొన్ని నిబంధనలున్నాయి. ఆ నిబంధనలకు లోబడి పీఎఫ్ డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా ఎలా చేసుకోవాలి
పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎమర్జన్సీ ఉంటే ఫారమ్ 19 ద్వారా ఫీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకూ జమ అయిన మొత్తం డబ్బుల్ని లేదా కొంతభాగాన్ని డ్రా చేసుకోవచ్చు. కొంతభాగం విత్ డ్రా చేయాలంటే ఫారమ్ 31 సమర్పించాలి. 20 రోజుల్లోగా డబ్బులు అందకపోతే రీజనల్ పీఎఫ్ కమీషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ unifiedportal-mem.epfindia.gov.in. ఓపెన్ చేయాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ కావాలి. మీ .యూఏఎన్ నెంబరే మీ పాస్‌వర్డ్ అవుతుంది. క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఆ తరువాత క్లెయిమ్ ఫామ్ 31, 19, 10సి, 10డిలలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. మీ యూఏఎన్ నెంబర్‌తో లింక్ అయిన ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు వెరిఫై చేసుకోవాలి. మీ బ్యాంక్ ఎక్కౌంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఈపీఎఫ్ఓ నిర్దేశిత నిబంధఘనలు పాటించాలి. ఆ తరువాత మీక్కావల్సిన నగదు ఎంటర్ చేసి ఇతర అడిగిన వివరాలతో సంబంధిత ఫామ్ సబ్మిట్ చేయాలి.
Also read: PPF Benefits: పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్, నెలకు 5 వేలతో 26 లక్షలు పొందే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook