EPFO Extends Higher Pension Deadline: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు గడవును మరోసారి పొడగించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ). జూన్‌ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. బుధవారంతో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో రెండు నెలలు పొడగిస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధిక పెన్షన్ ప్లాన్‌ ఎంచుకునే వారికి గడువు పెంపు నిర్ణయం ఊరట కలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 4 నవంబర్ 2022న ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం.. ఈపీఎఫ్‌ఓ పింఛనుదారుల నుంచి ఆప్షన్‌ వాలిడేషన్‌, జాయింట్‌ ఆప్షన్‌ దరఖాస్తులను స్వీకరించేందుకు ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్‌లో‌ ఏర్పాట్లు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అర్హులైన వారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఉద్యోగులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారని.. వారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోవడంతో గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, యాజమాన్యాల కోరిక మేరకు జూన్‌ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది.
 
కొన్నేళ్ల క్రితం చాలా తక్కువ మంది మాత్రమే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ప్రయోజనం పొందేవారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకునేవారు. అయితే ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఈ పథకాన్ని ప్రైవేట్ ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు కూడా సామాజిక భద్రత ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర అవకాశం కల్పిస్తూ 1995లో కీలక నిర్ణయం తీసుకుంది. 


ఈ పథకాన్ని ఈపీఎస్-95 అంటే.. ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 అని కూడా పిలుస్తారు. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం కింద ఈపీఎప్ ప్రవేశపెట్టినందున.. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చిన ప్రతి ఉద్యోగికి ప్రయోజనాలు చేకూరాయి. అయితే ఇందులో బేసిక్ శాలరీ, డీఏ నెలకు రూ.15 వేలు ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈపీఎస్‌ ప్రయోజనం పొందుతారని నిబంధన ఉంది.


Also Read: Ishant Sharma IPL: ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం.. సిక్సర్ల తెవాటియాకు చెక్  


Also Read: Aadhar Update 2023: ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబరు లింక్ చేశారా..? ఈజీగా తెలుసుకోండి ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి