న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 2017-18 సవత్సరానికి గానూ 8.55 శాతం వడ్డీని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్మికశాఖ మంత్రి నేతృత్వంలో ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీ బోర్డు ఈ రేటుకు ఆమోదం తెలిపినట్లు, 8.55 శాతం వడ్డీరేటును పీఎఫ్ ఖాతాల్లో వెంటనే జమచేయాలని అధికారులను ఈపీఎఫ్‌వో ఆదేశించింది.


గతంలో కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుందని ఆశించిన ఈపీఎఫ్ ఖాతాదారులను ఆశ్చర్యపరుస్తూ గతేడాది(2016–17) వడ్డీరేటు 8.65 శాతం కంటే 0.10 శాతం వడ్డీని తగ్గించింది. ఈ రేటును గతంలోనే ఖరారు చేసినప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా రెండు నెలలుగా అమలు చేయలేదని తెలిపింది. దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్‌వో అతి తక్కువ  వడ్డీరేటును ప్రకటించడం గడిచిన ఐదేళ్లలో ఇదే తొలిసారి.