EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు గమనిక, నిలిచిపోయిన ఆధార్ సేవలు
EPFO Alert: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు కీలకమైన అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. ఇప్పుడు ఎక్స్‌లో మరో అప్‌డేట్ ఇచ్చింది. ఆధార్ సంబంధిత సేవలు పని చేయడం లేదని ఈపీఎఫ్ఓ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Alert: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలకమైన గమనిక ఇది. ఈపీఎఫ్ పోర్టల్‌లో ఆధార్ సంబందిత సేవలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. సాంకేతిక కారణాలతో పోర్టల్ ఏర్పడిన సమస్య వల్ల ఈ పరిస్థితి ఎదురైందని ఈపీఎఫ్ఓ వివరించింది. పోర్టల్‌లో ఆధార్ సెటప్ మెయింటెనెన్స్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.
ఈపీఎఫ్ఓ ఖాతాకు ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి. ఒకవేళ మీరు చేయకపోతే వెంటనే ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రయ పనిచేయడం లేదు. ఆధార్ సెటప్ మెయింటెనెన్స్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాల కారణంగా ఈ సేవలు పనిచేయడం లేదు. తిరిగి ఎప్పుడు పనిచేస్తుందో ఈపీఎఫ్ఓ స్వయంగా వెల్లడించనుంది. ఇప్పటికే చాలామంది యూజర్లు ఈపీఎఫ్ఓ క్లెయిమ్, లాగిన్ అంశాల్లో ఎదురౌతున్న సమస్యల్ని ఎక్స్ ద్వారా ప్రస్తావించారు. ఎక్కౌంట్ హోల్డర్ల పాస్‌వర్డ్ అప్‌డేట్ కావడం లేదని మరో యూజర్ విన్నవించాడు. ఆన్‌లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేయడం కుదరడం లేదని మరో యూజర్ వివరించాడు. ఆధార్ నెంబర్ అథెంటిఫికేషన్ సంబంధిత చాలా సమస్యలు ప్రభావితమయ్యాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఎప్పుడు పరిష్కారమౌతుందనేది ఈపీఎఫ్ఓ చెప్పలేకపోయింది.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకుంటే ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ ఛానెల్ ఉపయోగించవచ్చు. ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఓ ఛానెల్ నడుపుతున్నామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ తరహా సమస్యల్ని నివేదించేందుకు ఖాతాదారులు epfigms.gov.in .వెబ్‌సైట్ సందర్శించాలి ఉంటుంది. సమస్యను నివేదించినప్పుడు గ్రీవెన్స్ ఐడీ ఒకటి జారీ అవుతుంది.
Also read: Mission Gaganyaan: గగన్‌యాన్ యాత్రకు అంతా సిద్ధం, అంతరిక్షంలో అడుగెట్టే నలుగురు ఎవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook