EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రా
EPS New System: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ ఇది. జనవరి 1 నుంచి 78 లక్షలమంది పీఎఫ్ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. పెన్షన్ విత్ డ్రా నిబంధనలు మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPS New System: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఖాతాదారుల ప్రయోజనం కోసం నిబంధనలు మార్చడం, సరళీకృతం చేయడం చేస్తుంటుంది. అదే విధంగా ఇప్పుడు మరోసారి ప్రైవేట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇస్తోంది. ఈ మార్పు వచ్చే ఏడాది 2025 జనవరి 1 నుంచి అమల్లో రానుంది. ఈపీఎఫ్ఓ కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది.
ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త విధానం ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా 78 లక్షలమంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఈ కొత్త విధానం ప్రకారం పీఎఫ్‌ను ఏదైనా బ్యాంకు లేదా పీఎఫ్ శాఖ నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే మీ ఎక్కౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసినట్టే చేయవచ్చు. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995కు సంబంధించిన సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన అందింది. పెన్షన్ ఏదైనా బ్యాంకు నుంచి లేదా ఏదైనా శాఖ నుంచి విత్ డ్రా చేసేలా కొత్త విధానం గురించి ఈ ప్రతిపాదన. ఈ కొత్త విధానం ద్వారా 78 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. జనవరి 1, 2025 నుంచి ఈ కొత్త విధానంలో అమల్లోకి రానుంది.
ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో ఈ కొత్త పెన్షన్ విధానం కీలక మలుపు కానుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవియా తెలిపారు. ఈ విధానంలో అమల్లోకి వచ్చిన తరువాత పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఏదైనా శాఖ నుంచి లేదా బ్యాంకు నుంచి పెన్షన్ విత్ డ్రా చేసుకోవచ్చు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అనేది మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఈ విధానం ద్వారా డబ్బులు నేరుగా ఎక్కౌంట్లో జమ అయిపోతాయి. దీనివల్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వ్యయం కూడా తగ్గనుంది.సెంట్రలైజ్డ్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది.
Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.