Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ

Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల సమయం సమీపిస్తోంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అటు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ థాకరే శివసేనలకు సవాలు కానున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2024, 11:38 AM IST
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ

Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం రెండూ కూటములే కావడంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. మహా వికాస్ అఘాఢి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ, శివసేన పార్టీలు రెండుగా చీలిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అత్యంత ఛాలెంజింగ్‌గా మారాయి. ప్రజాదరణ ఎవరికుందో తేలేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ థాకరే శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలికి గతంలో ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమితోనే బరిలో దిగుతున్నాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీలు 85 సీట్ల చొప్పున పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్ీట నేత నానా పటోల్ తో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు పార్టీలు కలిపి 270 సీట్లలో పోటీ చేస్తాయని మిగిలిన 18 సీట్లను ఇండియా కూటమి సన్నిహిత పార్టీలకు కేటాయిస్తామన్నారు. అయితే మూడు పార్టీలు 85 సీట్ల చొప్పున పొత్తు ఖరారైంది. మరో 15 సీట్లను రాష్ట్రంలోని ఇతర చిన్న పార్టీలకు కేటాయిస్తామన్నారు. లేకపోతే ఆ 15 సీట్లు కూడా మూడు పార్టీలు పంచుకుంటాయన్నారు. 

పైకి అధికారికంగా చెప్పకున్నా 15 సీట్ల విషయంలో మూడు పార్టీల మధ్య రాజీ కుదరలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, విదర్బా ప్రాంతాల్లో దక్షిణ నాగ్ పూర్, అమరావతి, ఘాట్ కోపర్ వెస్ట్, బైకుల్లా, కుర్లా, వర్సోవా, బాంద్రా ఈస్ట్, పరోలా, నాసిక్ వెస్ట్ సీట్ల గురించి మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. అందుకే ఈ 15 సీట్లను పెండింగులో పెట్టి మిగిలిన 255 సీట్లను 85 సీట్ల చొప్పున పంచుకుంటున్నట్టు ప్రకటించారు. 

సీట్ల సర్దుబాటు కుదరగానే ఉద్ధవ్ థాక్రే శివసేన 65 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 

Also read: Priyanka Gandhi Nomination: వయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రియాంక గాంధీ నామినేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News