EPF Withdraw Rules: పీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఇక ఈపీఎఫ్ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చంటే
EPF Withdraw Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి. ఇక పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే నియమాల్లో మార్పు వచ్చింది. పీఎఫ్ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.
EPF Withdraw Rules: ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ఖాతాదారులకు కీలకమైన అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఎక్కౌంట్ హోల్డర్ల సౌకర్యార్ధం వివిధ రకాల సౌకర్యాలు అందిస్తోంది. పీఎఫ్ అనేది రిటైర్మెంట్ తరువాత పెద్దమొత్తంలో డబ్బులు పొందే మార్గం. ఎప్పుడైనా అవసరమైనప్పుడు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. ఈపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బుల ఉపసంహరణ నిబంధనల్లో తాజాగా మార్పులు వచ్చాయి. పీఎప్ ఖాతా నుంచి అవసరమైనప్పుడు పాక్షికందా నగదు ఉపసంహరించుకునేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలు మార్చినట్టు స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సూఖ్ మాండవియా తెలిపారు. అంతేకాకుండా విత్‌డ్రా నగదు పరిమితిని కూడా పెంచారు. గతంలో 50 వేల వరకే నగదు విత్‌డ్రాకు అవకాశముండేది. కానీ ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఉద్యోగంలో చేరి ఆరు నెలలు పూర్తయితే చాలు పాక్షికంగా మీ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొద్దిగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. గతంలో అయితే చాలాకాలం వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. 6 నెలల్లో ఉద్యోగం వదిలేసినా పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులు పొందవచ్చు.
పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం ఎలా
దీనికోసం ముందుగా ఈపీఎఫ్ఓకు చెందిన ఈ సేవ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందులో మెంబర్ షిప్ క్లిక్ చేసి మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవాలి. ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇప్పుడు ఫారం 31, 19, 10సి లేదా 10డిల్లో ఒకటి ఎంచుకోవాలి. తరువాత వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి. ఫారం 31 ఎంచుకుని డబ్బులు ఎందుకు విత్ డ్రా చేయాలనుకుంటున్నారో కారణం వివరించాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి.
ఇప్పుడు మీ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీ అప్లై చేసిన 7-10 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాకు మీరు కోరిన డబ్బులు బదిలీ అవుతాయి.
వాస్తవానికి ఈపీఎఫ్ డబ్బులు రిటైర్మెంట్ తరువాత మాత్రమే పొందడానికి వీలుంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పాక్షికంగా పొందవచ్చు. వైద్య ఖర్చులు, పెళ్లి, పిల్లల చదువు, కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also read: Gold Rate Today: వారం తరువాత స్వల్పంగా పెరిగిన బంగారం, మీ నగరంలో బంగారం ధర ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.