EWS Reservation Eligibility: విద్య , ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. వీరికి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017లో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం సైతం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్(EWS Reservation Latest News) త్వరలో అమలు చేస్తామని గత జనవరిలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడానికిగానూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.  ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు  పొందడానికి  రాష్ట్ర  ప్రభుత్వం జారీచేసే  EWS సర్టిఫికేట్‌ను మీ స్థానిక  ఈసేవా/ మీసేవా కేంద్రాల్లో తీసుకోవచ్చు. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడానికి కొన్ని అర్హతలను నిర్ణయించారు. వీరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడానికి అర్హులు..



Also Read: Telanganaలో అగ్రవ‌ర్ణ పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ



1) కుటుంబ  వార్షిక  ఆదాయం  8 లక్షల రూపాయలలోపు ఉండాలి.


2) ఆ కుటుంబానికి భూమి 5 ఎకరాలకు మించి ఉండకూడదు


3) నివాస స్థలం(Flat) విస్తీర్ణం 1000 చదరపు అడుగులలోపు ఉండాలి


4) గ్రామీణ  లేక నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఇంటి స్థలం(ప్లాట్‌) 200 గజాల విస్తీర్ణంలోపు ఉండాలి.


5 ) మున్సిపాలిటీ ఏరియాలో ఇంటి స్థలం(ప్లాట్‌) 100 గజాల విస్తీర్ణంలోపు ఉండాలి.


Also Read: EPF ఖాతాదారులకు EPFO సరికొత్త సదుపాయం, ఆ సమస్యకు పరిష్కారం



ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థి తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు ఉన్న తొబుట్టువులు, జీవిత భాగస్వామి(భర్త/భార్య), 18 ఏళ్లలోపు ఉన్న సంతానాన్ని కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ అభ్యర్థి కుటుంబంలోని 18 ఏళ్లకు పైబడిన తోబుట్టువులు, సంతానం ఉంటే వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద పరిగణించలేమని కేంద్రం గతంలోనే స్పష్టతనిచ్చింది. 



పైన ఉన్న నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయనున్నాయి. 10 శాతం ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలిపితే మొత్తం 60 శాతం వరకు రిజర్వేషన్లు అమలవుతాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook