Michael Clarke Controversy Video: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకున్నారు. తనను మోసం చేశాడని క్లార్క్ గర్ల్ ఫ్రెండ్ జాడే యార్‌బ్రో  ఆరోపించింది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో క్లార్క్‌ను ఆమె పబ్లిక్‌గా చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మైఖేల్ క్లార్క్ వీడియోలో క్లార్క్ చొక్కా లేకుండా కనిపించాడు. ఈ వీడియోలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాడు. క్లార్ తన గర్ల్ ఫ్రెండ్ జాడే ముందు తన కూతురిపై ప్రమాణం చేయడం వీడియోలో వినిపిస్తోంది. క్లార్క్ మాటలకు పట్టించుకోని జాడే.. ముందుకు వెళ్లినట్లు మళ్లీ వెనక్కి వచ్చి.. చెంపదెబ్బ కొట్టింది. 


 




క్లార్క్, జాడే, ఆమె సోదరి జాస్మిన్, ఆమె భర్త కార్ల్ స్టెఫానోవిక్‌తో ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. నలుగురు కలిసి రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జాడే యార్‌బ్రో పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్వీన్స్‌లాండ్ పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 30 ఏళ్ల మహిళ, 41 ఏళ్ల వ్యక్తి మధ్య జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 


మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన వ్యక్తిగత జీవితంలో అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. 2007లో మోడల్ లారా బింగిల్‌తో క్లార్క్ డేటింగ్ చేశాడు. ఆ తరువాత వారిద్దరు విడిపోయారు. 2012లో కైలీ బోల్డిని వివాహం చేసుకున్నాడు క్లార్క్. మూడు సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనిచ్చారు. అయితే 2020లో క్లార్క్, కైలీ విడాకులు తీసుకున్నారు. 


Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి  


Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి