Exit Polls 2024: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మోదీ చరిష్మాకు పట్టం కట్టిన ఓటర్లు.. ఎగ్జిట్ సర్వేల్లో ఊహించని ఫలితాలు..
Loksabha elections 2024: మోదీ మేనియాను ఇండియా కూటమి ఏమాత్రం ఆపలేకపోయిందని తెలుస్తోంది. దేశంలో ఈరోజు సాయత్రం ఏడవ దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు సాయంత్రం 6.30 తర్వాత అనేక సర్వే సంస్థలు ఎగ్జీట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
Modi menia in loksabha election exit polls results 2024: దేశంలో ఎక్కడ చూసిన ఇప్పుడు మోదీ మేనియా మాత్రమే వినిపిస్తుంది. మోదీ చరిష్మాను కాంగ్రెస్ ఏ మాత్రం ఆపలేదని చెప్పుకొవచ్చు.. ఎన్డీయే కూటమి గరిష్టంగా 392 స్థానాలు, అంత కన్న ఎక్కువ స్థానాలు విజయం సాధించ వచ్చని జన్ కీ బాత్, రిపబ్లిక్ పీ మార్క్, ఇండియా కూటమి న్యూస్-డీ డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ తదితర సర్వే సంస్థలు తెల్చి చెప్పాయి. నరేంద్ర మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఎన్నో ఏళ్లుగా నానుతున్న అనేక అంశాలను ఆయన తనదైన స్టైల్ లో పరిష్కారం చూపడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకొవచ్చు.
Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?
మోదీ తీసుకున్న నిర్ణయాలలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్, సీఏఏ, అయోధ్య రామ జన్మభూమి వంటి అంశాలు ప్రజల్లో ఆయన పట్ల సానుకూల మార్పులను కల్గజేసిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా దేశంలో మోదీ సామాన్యుడిలా ప్రధానిగా మారి, ఒక అసమాన్యుడిగా ఎదిగారు. ఆయన మన దేశం ఖ్యాతీని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా తల ఎత్తుకునేలా చేశారు. ప్రపంచ దేశాలు పలు సమావేశాల్లో.. ఆయనను వచ్చి పలుకరించేలా కూడా ఆయన చేసుకున్నారు. అమెరికా, రష్యా, జపాన్ వంటి దేశాలు కూడా మనతో స్నేహ హస్తం కోసం ఆసక్తి చూపించేలా చేశారు.
మోదీ చరిష్మా..
దేశంలో మోదీ ఎక్కడికి వెళ్లిన తన దైన మార్కును చూపించారు. ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమిని పూర్తిగా ఏకీ పారేశారు. ఇక కాంగ్రెస్ నేతలు ఇటీవల పాక్ ను చూసి జాగ్రత్తగా ఉండాలని చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన, ప్రజల్లోకి తీసుకునిపోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకొవచ్చు. దేశానికి నాయకుడు ఎంతో ధైర్యంతో, కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడకుండా ఉండాలని మోదీ మెస్సెజ్ ఇచ్చారు. దాయాదులకు భయపడేవారు ఎలాంటి పాలన ఇస్తారని మోదీ కాంగ్రెస్ ను ఏకీపారేశారు. ఇండియా కూటమిలో పీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలీదని, వారిలో వారికే ఒకరంటూ ఒకరకి పడదంటూ కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు.
రామజన్మభూమి..
రామజన్మభూమికి పరిష్కారం చూపడం మోదీకి బిగ్ మైలేజ్ ఇచ్చిన అంశాల్లో ఒకటని చెప్పుకొవచ్చు. ఇది వందల ఏళ్లుగా పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ మోదీ సరైన విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా.. కోర్టు కూడా రామజన్మభూమి విషయంలో ఎవరి మనో భావాలు దెబ్బతినకుండా, ఇటు ఆలయం నిర్మాణానికి అటు మసీదు నిర్మాణానికి వేర్వేరు స్థలాలు కేటాయించింది. దీంతో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది. బాలరాముడిని కళ్లారా చూడటానికి కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ట్రిపుల్ తలాఖ్..
ముస్లింలు ముఖ్యంగా ట్రిపుల్ తలాఖ్ రద్దును ఎంతో స్వాగతించారు. దీని వల్ల అనేక ముస్లిం కుటుంబాలు కూడా మోదీకి సపోర్టుగా నిలిచాయి. కేవలం హిందువులకు మాత్రమే మోదీ ఫెవర్ గా పనులు చేస్తారనే వారికి ఇది చెంపదెబ్బలా మారింది. దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేకపోయారు. ముస్లిం కుటుంబాలు సైతం తలాఖ్ ను రద్దు చేయడంలో ఆనందం వ్యక్తం చేశాయి.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్..
మోదీ తన పాలనలో కులమతాలకు అతీతంగా పాలన అందించారని చెప్పుకుంటారు. ఆయన ఎక్కడ సభలు జరిగిన.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదాల్నిపదే పదే చెప్తుంటారు. ఏ కొందరి డెవలప్ మెంట్ వల్ల దేశం ముందుకు వెళ్లదని, అందరు కలిసి వస్తేనే దేశం అన్నిరంగాల్లో డెవలప్ అవుతుందని మోదీ అన్నారు.
కాంగ్రెస్ వివాదస్పద అంశాలు..
మోదీ ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పడు వివాదస్పదంగా మాట్లాడిన వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంతో సక్సెస్ అయ్యారని చెప్పుకొవచ్చు. పాక్ వాళ్లు రాహుల్ కు మద్దతుగా వీడియో రిలీజ్ చేసినప్పుడు మోదీ, ఇతర బీజేపీ నేతలు ఒక రేంజ్ లో కాంగ్రెస్ ను ఆడుకున్నారు. దాయాదులు, వీరంటే ఎందుకంత ఇష్టమని అన్నారు. మనదేశాన్ని ఆక్రమించుకునేవారు, టెర్రరిస్టు క్యాంపులు నడిపేవారు, రాహుల్ ను పొగిడే అవసరం ఏముందని మోదీ అన్నారు. వీళ్లేమో.. పాక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటారు, పాక్ వాళ్లు రాహుల్ ను పొగుడుతారు.. వీటన్నింటి వెనుక ఏముందు ఒక్కసారి ప్రజలు ఆలోచించాని కూడా మోదీ అనేక సభలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు.
మోదీ ప్రసంగాలు..
మోదీ ఎక్కడికి వెళ్లిన తన పదునైన ప్రసంగాలు, వాగ్భాణాలలో అపోసిషన్ వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. తనకు దేశంలోని ప్రజలు కుటుంబమని, ఇతర ఫ్యామిలీలేదని అనేక సందర్భాలలో తెల్చి చెప్పారు. దేశంకోసం తన చివరి శ్వాస వరకు పోరాడి మంచి చేస్తానని కూడా మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇండియా కూటమిలో అన్నిపార్టీలు తమ వారసత్వంగా ఉన్న వారి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాయని, వారిని కార్నర్ చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారని చెప్పుకొవచ్చు.
ఇక వీటన్నింటి ఫలితంగా ఈ రోజు విడుదలైన ఎగ్జిట్ సంస్థల ఫలితాలలో ఎన్డీయే భారీ మెజార్టీ సాధించింది. దేశంలో మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని, ఆయన చరిష్కాను ఆపగల పార్టీ దరిదాపుల్లో కూడా లేదని తెలిపోయింది. ఒక నోక సమయంలో.. మోదీ వర్సెస్ ఇండియా కూటమిగా మారిపోయిందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter