Madhya pradesh woman was bitten by snake six times in six years: చాలా మంది పాములంటే భయంతో వణికిపోతుంటారు. పాము అని పేరు ఎత్తడానికి కూడా చాలా మంది అస్సలు ఇష్టపడరు. అడవులు, నీళ్లు, గుబురుగా చెట్లు ఉండే ప్రాంతాలలో పాములు ఎక్కువగా ఉంటాయి. పొలాల్లో కూడా పాములు తరచుగా కన్పిస్తుంటాయి. పంట పొలాలకు నీళ్లు వదలడానికి వెళ్లి చాలా మంది రైతులు పాముల కాటుకు గురై చనిపోయిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఇక కొందరు పాములు కన్పిస్తే, వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం పాముల్ని చంపేస్తుంటారు.
Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..
ఇంకొందరు కాటువేసిన పాముని పట్టుకుని, చంపేసి మరీ ఆస్పత్రికి వెళ్తుంటారు. అక్కడ తమను ఈ పాము కాటు వేసిందని సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెబుతుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, మధ్యప్రదేశ్ లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను పాము ఆరుసార్లు కాటు వేసింది. దీంతో స్థానికులు పాము ఆమెపై పగపట్టిందని చెప్తుంటారు.
పూర్తి వివరాలు..
మధ్యప్రదేశ్‌లోని కట్నీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బహోరీబంద్ లోని గుణబచయ గ్రామానికి చెందిన పూజా వ్యాస్ అనే మహిళ ఉంది. ఈమె ఇంట్లో, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురైంది. ఇలా ఆమె ఆరేళ్లలో ఆరుసార్లు పాము కాటుకు గురైనట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాము కరిచిన ప్రతిసారి ఆమె ఆస్పత్రికి వెళ్లి సరైన ట్రీట్మెంట్ చేయించుకుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇటీవల కూడా పూజను పాము కాటు మరోసారి వేసింది.
ఇంట్లో ఆమె పని చేస్తుండగా.. ఒక పాము వచ్చి ఆమెను కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హుటా హుటీన ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి, యాంటీవీనమ్ డోస్ ఇచ్చి సకాలంలో చికిత్స అందించడంలో పూజ బతికిబయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను జిల్లా ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రక రకాల పాములు వచ్చి ఆమెను మాత్రమే కాటు వేయడం వెనుక ఏదైన ఘటన ఉండోచ్చని స్థానికులు చెప్పుకుంటుంటారు. ఆమె గత జన్మలో లేదా తెలిసి, తెలియక పాములకు ఏదైన అపకారం చేసి ఉండోచ్చని అందుకే పాములు ఆమెపై పగబట్టాయని కూడా కథలు కథలుగా చెప్పుకుంటు ఉంటారు. ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter