ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: బీజేపికే మళ్లీ పట్టం కడుతున్న సంస్థలు
నేటితో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తిస్థాయిలో ముగిసింది. దేశవ్యాప్తంగా 542 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. దీంతో మీడియా సంస్థలపై ఇప్పటివరకు వున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడికి వున్న ఆంక్షలు తొలగిపోయాయి. ఎన్నికలు పూర్తిగా ముగిసిపోయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నిషేధాన్ని ఎత్తివేసింది.
న్యూఢిల్లీ: నేటితో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తిస్థాయిలో ముగిసింది. దేశవ్యాప్తంగా 542 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. దీంతో మీడియా సంస్థలపై ఇప్పటివరకు వున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడికి వున్న ఆంక్షలు తొలగిపోయాయి. ఎన్నికలు పూర్తిగా ముగిసిపోయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇసి నిషేధం ఎత్తివేయడంతో టుడేస్ చాణక్య, రిపబ్లిక్ సి ఓటర్, ఏబిపి-సీఎస్‌డిఎస్, న్యూస్18-ఐపిఎస్ఓఎస్, ఇండియాటుడే-యాక్సిస్, టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్, న్యూస్ఎక్స్-నేత వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
తమ సంస్థ అంచనాల ప్రకారం బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300పైగా సీట్లు గెల్చుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని న్యూస్18-ఐపిఎస్ఓఎస్ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో స్పష్టంచేసింది.
న్యూస్ఎక్స్-నేత వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపితోపాటు ఎన్డీఏ అనుబంధ పార్టీలకు 242 సీట్లు, కాంగ్రెస్ పార్టీతోపాటు అనుబంధ సంస్థలకు 162, ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ 43 స్థానాలు, ఇతరులకు 88 సీట్లు లభిస్తాయని తెలుస్తోంది.