జమ్మూ కాశ్మీర్ విషయంలో లేనిపోని ప్రేమను ఒలకబోస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు భారత్ నుంచి ధీటైన సమాధానం ఎదురైంది. ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రత సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ చాలా సూటిగా సమాధానం ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ము కాశ్మీర్ లో ప్రస్తుతం అంతా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ అన్నారు.  ఐతే పాకిస్తాన్ నుంచి మాత్రం ముప్పు ఉందని వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా మండలి సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఐతే ఈ సందర్భంగా పలు దేశాల నుంచి వచ్చిన విదేశాంగ శాఖ మంత్రులు జమ్మూ కాశ్మీర్ అంశంపై పలు రకాల ప్రశ్నలు సంధించారు. అందులో అమెరికా నుంచి వచ్చిన సెనెటర్ లిండ్సే గ్రాహం.. జమ్ము కాశ్మీర్ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది..? రెండు దేశాలు ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకోసం ఏదో ఒక దేశం పరిష్కార మార్గాన్ని చూపించాలని కోరారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్.. డోంట్ వర్రీ మిత్రమా.. ఒక ప్రజాస్వామ్య దేశం అందుకు సిద్ధంగా ఉందంటూ తెలిపారు. అది ఏ దేశమో మీకు తెలిసే ఉంటుందని చెప్పారు.



Read Also:ప్రధానీ మోదీకి అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానం


అంతేకాదు .. తుర్కిష్ అధ్యక్షుడు చేసిన సూచనను కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి తిరస్కరించారు.  పాకిస్తాన్, భారత్ మధ్య తుర్కిష్ పాకిస్తాన్ జాయింట్ డిక్లరేషన్ లాంటిది అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది భారత దేశంలో అంతర్భాగమని పేర్కొన్నారు.