వలస కూలీల దుర్మరణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించినట్లు ప్రధాని తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో దేశంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఏపీలోని విశాఖలో గ్యాస్ లీకేజీతో 11 మంది చనిపోగా, నేడు మహారాష్ట్రలో రైలు ప్రమాదం వలస కూలీలను చిదిమేసింది. పట్టాలపై నిద్రిస్తున్న వలస వారిపై గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. ఔరంగాబాద్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు ప్రమాదం: 16కి చేరిన మృతులు సంఖ్య
రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ప్రమాదంపై చర్చించినట్లు తెలిపారు. బాధితులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని, సహాయకర చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు ట్వీట్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!