పెళ్లి చేసుకోవాలని వేధించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ అరెస్ట్
పెళ్లి చేసుకోవాలని వేధించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ ద్వారా స్నేహితుడు అయిన ఓ యువకుడు ఆ తర్వాత తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన ఢిల్లీలోని ఆర్.కె.పురంలో చోటుచేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ ఖాన్, అతడి స్నేహితుడు సొనేందర్ గత కొంత కాలంగా తనను వేధిస్తున్నారని శనివారం యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
తనని పెళ్లి చేసుకోకపోతే నీ వ్యక్తిగత ఫోటోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని ఖాన్ బెదిరిస్తున్నాడని, ఖాన్‌తోపాటు అతడి స్నేహితుడు సొనేందర్ సైతం వైధింపులకు పాల్పడుతున్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సౌత్ వెస్ట్ ఢిల్లీ డీసీపి దేవేందర్ ఆర్య తెలిపారు. అఫ్తాబ్ ఖాన్, సొనేందర్‌లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్టు డీసీపి వెల్లడించారు.