Facebook Instagram Down Across Globe: ఒక్కసారిగా ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , మెస్సెంజర్ సర్వీసులు ప్రపంచ వ్యాప్తంగా పనిచేయడం మానేశాయి. దీనిలో లాగిన్ కు తీవ్ర సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. చాలా మంది సర్వర్ డౌన్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గంటల నుంచి లాగిన్ కావడంలో ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. దీనిమీద సైబర్ నిపుణులు తమ దైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Yashika Aannand: బోల్డ్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషికా, ట్రెండింగ్ లో పిక్స్


ఏకకాలంలో.. చాలా మంది సర్వర్ లను లాగిన్ అవ్వడానికి ప్రయత్నించడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమౌతుందని పేర్కొన్నారు. కొందరు నకిలీఖాతాలు కూడా కల్గిఉంటారు. కొన్ని అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు కూడా ఇలా లాగిన్ లకు ప్రయత్నించడం వల్ల ఇలా జరిగే అవకాశంఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. తొందరలనే మరల ఫేస్ బుక్ లు తీరిగి పనిచేయడం ప్రారంభిస్తాయని కూడా నిపుణులు పేర్కొన్నారు. 


ప్రస్తుతం ప్రతిఒక్కరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. కొన్ని గంటల నుంచి ఫేస్ బుక్ మోరాయిస్తుండటంతో చాలా మంది ఏమైందో అని టెన్షన్ కు గురయ్యారు. మెటా సంస్థ దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని యూజర్ లు కొరుతున్నారు.


కోట్లాది మంది తమ అకౌంట్ లు యాక్సిస్ చేయలేకపోవడంతో.. ఒక్కసారిగా ఎవరైన హ్యకింగ్ కు పాల్పడ్డారా.. అని కూడా అనుమానపడ్డారు. ఫేస్ బుక్ లో చాలా మంది లాగిన్ కాకపోవడంతో మరో లాగిన్ తో కూడా ట్రై చేశారు. అలా పలుమార్లు పాస్ వార్డులను మార్చిన కూడా ఫేస్ బుక్ ఓపెన్ కాకపోవడంతో చివరకు, డౌన్ సమస్య అని తెలిసి అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా సంస్థలు చర్యలు తీసుకొవాలని యూజర్ లు కోరుతున్నారు. 
 


Read More: Teeth Whitening Tips: మీ దంతాలు పచ్చగా ఉన్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముత్యాల్లా మెరుస్తాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook