1 lakh deposit in bank accounts of women ? న్యూఢిల్లీ: మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. మహిళ స్వరోజ్‌గార్ యోజన పథకం ( Mahila swarozgar yojana ) కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేస్తోందనేది ఆ వదంతుల సారాంశం. సామాజిక మాధ్యమాలు విరివిగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అందులో ఏం పోస్ట్ చేసినా అది వెంటనే వైరల్ అవుతోందనే సంగతి తెలిసిందే. అందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే నెటిజెన్స్ ఆ పోస్టులను వైరల్ ( Viral social media posts ) చేస్తున్నారు. ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. దీంతో అనేక ఫేక్ న్యూస్ పోస్టులు ( Fake news posts ) కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియని అమాయక జనం.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తమ విషయంలో ఎందుకు జరగడంలో లేదని ఆందోళనకు గురవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం ( Modi govt ) లక్ష రూపాయల డిపాజిట్ చేస్తున్నట్టుగా తాజాగా జరుగుతున్న ప్రచారం కూడా అలాంటిదేనని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వదంతులపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ( PIB ) స్పందిస్తూ.. కేంద్రం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టంచేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఫేక్ న్యూస్‌గా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ( PIB fact check ) తేల్చిచెప్పింది. 



 


How to get messages fact-checked ఫేక్ న్యూస్ అవునో కాదో ఎలా తెలుసుకోవాలి ? :
మనకు నిత్యం అలాంటి అనుమానాస్పద సందేశాలు ఎన్నో వస్తుంటాయి. కానీ అందులో ఎంతమేరకు నిజం ఉందో తెలుసుకునే మార్గం మాత్రం అతికొద్ది మందికే తెలుసు. అదెలాగంటే.. ఇదిగో https://factcheck.pib.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవడం ద్వారా అక్కడ సూచించే పలు ఆప్షన్స్ ద్వారా ఆ సందేశాన్ని మీరు ధృవీకరించుకోవచ్చు. లేదంటే +918799711259 నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా కూడా మీకు వచ్చిన న్యూస్ నిజమా లేక అది ఫేస్ న్యూసేనా అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా pibfactcheck@gmail.com కి మెయిల్ చేయడం ద్వారా కూడా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe