Fake COVID-19 test reports: న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో కరోనా పరీక్షలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కరోనా పరీక్షల కోసం వచ్చే బాధితులను లక్ష్యంగా చేసుకుని వారికి నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇచ్చి వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకున్న ఓ ముఠా తాజాగా ఢిల్లీ సౌత్ జోన్ పోలీసులకు దొరికిపోయింది. ఏప్రిల్ 23 నుంచి నిందితులు నకిలీ కరోనా పరీక్షల రిపోర్టులను తయారు చేసి విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న సౌత్ ఢిల్లీ పోలీసులు వారిని పథకం ప్రకారం వల వేసి పట్టుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్ప‌టివ‌ర‌కు ఈ ముఠా 400పైగా నకిలీ కొవిడ్-19 రిపోర్టులు విక్రయించినట్టు వెల్ల‌డైంద‌ని సౌత్ ఢిల్లీ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. త‌న కుటుంబంలోని 45 మందికి ఈ ముఠా న‌కిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇచ్చిందని ఒక వ్య‌క్తి నుంచి ఫిర్యాదు అందడంతో ఢిల్లీ సౌత్ జోన్ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ నకీలీ కరోనా రిపోర్టుల బాగోతం బయటపడింది. 


Also read : Anchor Shyamala: తన భర్త నరసింహా రెడ్డిపై చీటింగ్ కేసులో వీడియో విడుదల చేసిన యాంకర్


ఇటీవల కాలంలో కొద్ది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన 45 మంది కరోనా పరీక్షల (Coronavirus tests) కోసం ఒకే చోట శాంపిల్స్ ఇచ్చారు. కాగా వీరిలో ఒక‌రికి ఏమాత్రం కరోనావైర‌స్ ల‌క్ష‌ణాలు (Corona second wave symptoms) లేక‌ుండా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో అనుమానం కొద్దీ మరోసారి ధృవీకరించుకునేందుకు మరో ల్యాబ్‌లో ప‌రీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా ఫ‌లితం వ‌చ్చింది. దీంతో గ‌తంలో త‌మకు ఇచ్చిన కొవిడ్-19 రిపోర్ట్‌ లెటర్ హెడ్‌పై ఉన్న వివరాల ఆధారంగా వెళ్లి అసలు ల్యాబ్‌లో నిల‌దీయ‌గా.. అస‌లు అలాంటి పేరుతో తమ వద్దకు ఏ శాంపిల్ రాలేదని తేల్చిచెప్పారు. ఆ రిపోర్టు ఇచ్చిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేద‌ని స‌ద‌రు ల్యాబ్ స్పష్టంచేసింది.


ల్యాబ్ వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం తమకు కొవిడ్-19 (COVID-19) రిపోర్టు ఇచ్చిన వాళ్లే తమను మోసం చేశారని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అలా నకిలీ కరోనా పరీక్షల రిపోర్టులు (COVID-19 fake reports) ఇచ్చి జనాన్ని మోసం చేస్తోన్న మోసగాళ్లు పోలీసుల చేతికి చిక్కారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook