Fake Massage Viral On Lockdown: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. చైనాలో ప్రతి రోజూ లక్షలాది మంది కోవిడ్-19 బారిన పడుతుండడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా మారింది. మృతదేహాలను దహనం చేసేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేకపోవడంతో రోడ్లపై దహనం చేసేంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక భారత్‌లోనూ కొత్త వేరియంట్ బీఎఫ్‌.7 కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తారని ఓ మెసేజ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ -19ని నిరోధించడానికి దేశంలో 15 రోజుల లాక్‌డౌన్ ఉంటుందని ఆ మెసేజ్‌లో ఉంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు 15 రోజుల పాటు మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మెసేజ్‌లోకు సంబంధించిన టీవీ స్క్రీన్‌ను ఆధారంగా చేసుకుని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ మెసేజ్ వైరల్ అవ్వడంతో ప్రజలలో మళ్లీ లాక్‌డౌన్ చర్చ మొదలైంది.


ఈ వైరల్ మెసేజ్‌పై ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ మెసేజ్‌ ఫేక్ అని స్పష్టం చేసింది. కోవిడ్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేముందుకు.. నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించింది. తప్పుదారి పట్టించే సందేశాలను ఫార్వార్డ్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పీఐబీ హెచ్చరించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ అవసరమని చెప్పడం పూర్తిగా ఫేక్‌గా పేర్కొంది. ప్రభుత్వం లాక్‌డౌన్ గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.


ఇక తాజాగా పశ్చిమ బెంగాల్‌లో బీఎఫ్ 7 వేరియంట్ నాలుగు కేసులు నమోదయ్యాయి. అందరూ అమెరికా నుంచి వచ్చారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. నలుగురిలో ముగ్గురు నాడియా జిల్లాకు చెందిన వారని.. ఒకరు బీహార్ నివాసి అని, ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారని వెల్లడించారు.


Also Read: Shabbir Ali, Revanth Reddy: పార్టీలో సీనియర్లు , జూనియర్లు పంచాయతీ ఏంది: షబ్బీర్ అలీ


Also Read: Kamal Haasan Surprises DSP : దేవీ శ్రీ ప్రసాద్‌కు కమల్ హాసన్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ స్టైల్లో లోకనాయకుడు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి