Farmer protests live: rakesh tikait: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ( Farmer protests ) 17వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని వామపక్ష అతివాదులు, సానుభూతి పరులు హైజాక్ చేసే అవకాశం ఉందని (anti national elements), వారు ఉద్యమంలోకి ప్రవేశించి సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని కేంద్ర ప్రభుత్వానికి (central government) ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది. ఆందోళనలపై వామపక్ష అతివాదులు సలహాలిస్తున్నారని.. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించినట్లు అధికారులు కేంద్రానికి తెలిపారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అన్నిచోట్ల భద్రతను మరింత పెంచింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ (Rakesh Tikait ) స్పందించారు. తమ ఉద్యమంలోకి సంఘ విద్రోహులు ప్రవేశిస్తే వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు. తామైతే ఇప్పటి వరకూ అలాంటి వారిని కనుగొనలేదని, ప్రభుత్వ వర్గాలు అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే అదుపులోకి తీసుకోని జైళ్లల్లో వేయాలని సూచించారు. ఈ రోజు చేపట్టిన రహదారుల దిగ్బంధంతో తమ సమస్యలను వినేలా కేంద్రానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నామని టికాయత్ పేర్కొన్నారు. Also Read: Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం



శనివారం ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారులను రైతులు దిగ్బంధించేందుకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ ( Delhi ) సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులను మూసివేసి వేలాది మంది పోలీసులను మోహరించారు.  Also read: Farmer protests: వ్యవసాయ చట్టాలపై సుప్రీంను ఆశ్రయించిన రైతులు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook