Farmer protests: 25వ రోజుకు ఆందోళనలు.. నేడు అమర రైతులకు నివాళి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
Farmer protests Updates: Shahidi Divas Today : న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను (Farm laws) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు (Farmer Agitation) ఆందోళన చేస్తున్నారు. గడ్డకట్టే చలిలో కూడా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలు ఆదివారంతో 25వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా షాహిది దివస్ (Shahidi Divas) గా పాటించి రైతు అమరవీరులకు నివాళులర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశవ్యాప్తంగా నివాళులర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన తర్వాత వివిధ కారణాలతో 33 మంది రైతులు మరణించారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఘాజీపూర్ వద్ద రైతులతో అధికారులు చర్చించనున్నారు. ఈ సందర్భంగా రైతుల ట్రాక్టర్లను అడ్డుకోవడంపై అధికారులను ప్రశ్నిస్తామని రైతు సంఘాల నేతలు (Farmers Organizations) ప్రకటించారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
అంతకుముందు కేంద్రం (Central Government) తో పలుమార్లు జరిగిన చర్చలు కూడా విఫలం అయిన నేపథ్యంలో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వ్యవసాయ చట్టాల్లో తమకు మార్పులు అవసరం లేదని.. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. రైతుల ఉద్యమం రాజకీయ ప్రేరేపితమని.. రైతులను పలు పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విమర్శలను రైతు సంఘాలు ఖండిచాయి. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతమంటూ కేంద్రానికి పలు రైతు సంఘాలు లేఖ రాశాయి.
Also read; Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook