Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 22 రోజులుగా ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 

Last Updated : Dec 17, 2020, 05:33 PM IST
Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్

Farmer protests: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 22 రోజులుగా ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గురువారం ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళ‌న‌పై ప్ర‌సంగిస్తూ సీఎం కేజ్రీవాల్ ( Delhi CM Kejriwal ) కొత్త రైతు చ‌ట్టాల ప్ర‌తుల‌ను చింపేసి.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరిస్తుందని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 20 రోజులుగా జరుగుతున్న నిరసనల్లో 20 మందికి పైగా రైతులు మరణించారని.. ప్రతీరోజూ సగటున ఒక రైతు మరణిస్తున్నాడని అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగా అసెంబ్లీలో మాట్లాడిన కేజ్రీవాల్..  క‌రోనా మ‌హ‌మ్మారి వేళ పార్ల‌మెంట్ నిర్వ‌హించి.. రైతు చ‌ట్టాల‌ను అమల్లోకి తీసుకురావ‌డం ఎంత వ‌ర‌కు సమంజసమని కేంద్రాన్ని ప్రశ్నించారు. Also read: Farmer protests: సిక్కు మతగురువు ఆత్మహత్య

ప్ర‌తి ఒక రైతు భ‌గ‌త్ సింగ్‌లా మారార‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుంటున్నామ‌ని చెబుతోంద‌ని, రైతు చ‌ట్టాల వ‌ల్ల లాభాలు ఉన్న‌ట్లు వివ‌రిస్తున్నార‌ని, ఇది మ‌తి లేని చ‌ర్యగా కేజ్రీవాల్ అభివర్ణించారు. రాజ్య‌స‌భ‌లో ఓటింగ్ నిర్వ‌హించ‌కుండా తొలిసారి మూడు రైతు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చార‌ని, కేంద్ర పాల‌కులు బ్రిటీష‌ర్ల క‌న్నా హీనంగా మారకూడదు అంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వ్యవసాయ చట్టాల ప్రతులను చింపివేశారు. ఆయనతోపాటు ఆప్ (AAP) ఎమ్మెల్యేలు సైతం కొత్త వ్యవసాయ చట్టాల ప్రతులను చింపి నిరసన తెలిపారు. Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News