New Delhi: ఎర్రకోటపై తమ జెండా ఎగురవేసిన రైతులు, ఉద్రిక్తంగా మారుతున్న Tractor Rally
Farmers Hoisted Khalsa flag at Red Fort in New Delhi: ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తలకు దారి తీసింది. శాంతియుత ర్యాలీగా ప్రారంభమైన రైతుల నిరసన హింసకు దారి తీస్తోంది. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారీకేడ్లను అడ్డు తొలగించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
Khalistan Flag: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తొలుత నిర్ణీత సమయానికన్నా ముందుగానే అన్నదాతలు సరిహద్దులు దాటి తమ ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించారు. పలుచోట్ల పోలీసులు, రైతులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రైతులపై లాఠీఛార్జ్ చేసేంతగా పరిస్థితి మారిపోయింది.
బారీకేడ్లను పక్కకు తోసుకుంటూ ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతులు ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకున్నారు. ఏకంగా ఎర్రకోటపై తమ జెండాను రైతులు ఎగరవేశారు. త్రివర్ణ పతాకం రెపరెపలాడిన గణతంత్ర దినోత్సవం(Republic Day 2021) రోజు ఎర్రకోటపై ఖల్సా జెండా()ను రైతులు ఎగురవేయడం వివాదాస్పదంగా మారుతోంది.
Also Read: Farmers Tractor Rally: బారీకేడ్లను విచ్ఛిన్నం చేసుకుంటూ ఢిల్లీలో ముందుకు సాగుతున్న రైతులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు గత కొన్ని రోజులుగా నిరసన (Farmers Protest Latest Update) తెలుపుతున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇదివరకే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ట్రాక్టర్లు చేరుకుంటున్నాయి.
రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో అయిదు అంచల భద్రతా వ్యవస్థను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. భద్రతా కోసం 6వేల మందికిపైగా సిబ్బందిని ఢిల్లీలో మోహరించారు. ముఖకవళికలను గుర్తించే అత్యాధునిక పరికరాలనూ పోలీసులు అమర్చారు. అయినా రైతులు, ఆందోళనకారులు తమ నిరసనను ఉద్రిక్తం చేస్తున్నారు.
Also Read: Delhi Farmers Protest: ఉద్రిక్తంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ, రైతన్నలపై విరిగిన లాఠీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook