Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు`గండం`..మూడురోజులపాటు భారీ వర్ష సూచన..!
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం తరుముకొస్తోంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావం అధికంగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం వాయవ్య ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్లు, సాగర్ దీవులకు ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం..పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లోని బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్య కాసేపట్లో తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఛతీస్‌గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీన పడే సూచనలు ఉన్నాయి.
ఇటు ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. ఇవాళ, రేపు మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురుగాలులు సైతం ఉంటాయని తెలుస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న రెండు గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వాన పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, హన్మకొండ, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో రాగల రెండు గంటల్లో వానలు పడనున్నాయి.
ఇటు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలిక పాటి వానలు పడనున్నాయి. రాయలసీమలోనూ రాగల మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంట ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
Also read:IND vs ZIM: మరో సిరీస్‌పై కన్నేసిన టీమిండియా..రేపే జింబాబ్వేతో రెండో వన్డే..!
Also read:Viral Video: ముంబైలో కళ్ల ముందే కూలిన భవనం..స్థానికుల పరుగులు..వీడియో వైరల్..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook