Fathers Day 2022: ఇవాళ ఫాదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా
Fathers Day 2022: ప్రతీ ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకుంటారు. ముఖ్యంగా ఇండియా, అమెరికా తదితర దేశాల్లో ఈరోజున ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో మార్చి, మే నెలల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.
Fathers Day 2022: 'ఒక నాన్న తను తెగిన చెప్పులు కుట్టించుకుని నీకు కాలేజీ వెళ్లేందుకు నైక్ షూస్ కొనిపెట్టాడు. తను కొత్త చొక్కా కొనుక్కోకుండా నీకు కాలేజీ ఫీజు కట్టాడు. పొదుపు చేసి పోగేసి నిన్ను సంబడీ చేశాడు..' నాన్న త్యాగాలను,గొప్పతనాన్ని వివరిస్తూ కవి అరుణ్ సాగర్ తొలి నమస్కారం తండ్రికి అనే కవితలో రాసిన వాక్యాలివి. ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతీ కొడుకు, కూతురు తమ తండ్రి త్యాగాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు. అసలు ఈ ఫాదర్స్ డే ఎలా మొదలైంది.. దీని ప్రాముఖ్యత ఏంటి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఫాదర్స్ డే ప్రాముఖ్యత :
ప్రతీ ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకుంటారు. ముఖ్యంగా ఇండియా, అమెరికా తదితర దేశాల్లో ఈరోజున ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో మార్చి, మే నెలల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.
కుటుంబం కోసం తండ్రి పడే తపన, కష్టం, నిస్వార్థ త్యాగం.. వీటన్నింటిని గుర్తుచేసుకోవడంతో పాటు ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలంతా కలిసి కనీసం ఒక్కరోజైనా తండ్రితో గడిపేందుకే ఫాదర్స్ డే.
ఫాదర్స్ డే ఎలా మొదలైంది :
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసింది అమెరికాకు చెందిన సొనారా అనే మహిళ. సొనారా తల్లి చిన్నతనంలోనే చనిపోగా ఆరుగురు పిల్లలను తండ్రే పెంచి పెద్ద చేశాడు. భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల ఆలనా, పాలనా అన్నీ తానై చూసుకున్నాడు. బిడ్డలకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. సొనారా పెద్దయ్యాక తండ్రి త్యాగానికి గుర్తుగా ఏదైనా చేయాలనుకుంది. తన లాంటి తండ్రులందరికీ గౌరవార్థంగా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలని ఆమె పోరాటం చేసింది. ఆ తర్వాతి రోజుల్లో అమెరికా ప్రభుత్వం జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా గుర్తించింది. ఆరోజు తండ్రులందరికీ సెలవు దినం. అయితే ఇండియాలో దీన్ని అధికారికంగా గుర్తించలేదు కాబట్టి ఇక్కడ సెలవు ప్రకటించలేదు.
ఫాదర్స్ డే కొటేషన్స్ :
ఒక తండ్రి తను తన కూతురిని లేదా కొడుకుని ప్రేమిస్తున్నానని ఎప్పుడూ వారితో చెప్పకపోవచ్చు. కానీ ఆ తండ్రి చేతల్లో అది ఎప్పుడూ వ్యక్తమవుతూనే ఉంటుంది.
'మా నాన్నే నా హీరో. నాకోసం ఎప్పుడూ నిలబడింది ఆయనొక్కరే. నేను ఏది చెప్పినా ఓపికగా విన్నారు.. జీవితంలో ప్రతీ విషయాన్ని ఓపికగా నేర్పించారు. '
'ఒక తండ్రి.. వంద స్కూల్ మాస్టార్ల కన్నా ఎక్కువ..'
'తండ్రిగా నిన్ను నేను అర్థం చేసుకోకపోయినా.. నాన్న నువ్వు మాత్రం నాకోసమే ఎప్పుడూ తపించావు. హ్యాపీ ఫాదర్స్ డే.'
Also Read: Rain Alert: తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook