KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?

KTR MEET JUPALLI: అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త సీన్ కనిపిస్తోంది. గతంలో పార్టీలో ఎవరైనా లీడర్లు అసంతృప్తిగా ఉన్నా కేసీఆర్ పట్టించుకునేవారు కాదు. పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగినా.. పోతే పోనీ అన్నట్లుగా లైట్ తీసుకునేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను స్వయంగా బుజ్జగిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Written by - Srisailam | Last Updated : Jun 19, 2022, 08:23 AM IST
  • మొన్న పొంగులేటి.. నిన్న జూపల్లి
  • అసమ్మతి నేతలకు కేటీఆర్ బుజ్జగింపులు
  • కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?
KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?

KTR MEET JUPALLI: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం సాగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్షాల నేతలు దూకుడు పెంచారు. నేతల వలసలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త సీన్ కనిపిస్తోంది. గతంలో పార్టీలో ఎవరైనా లీడర్లు అసంతృప్తిగా ఉన్నా కేసీఆర్ పట్టించుకునేవారు కాదు. పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగినా.. పోతే పోనీ అన్నట్లుగా లైట్ తీసుకునేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను స్వయంగా బుజ్జగిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంటికి వెళ్లి మరీ సదరు నేతలతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ మారడం ఖాయమనుకున్న నేతలను కూడా కలుస్తున్నారు కేటీఆర్. ఈ పరిణామాలే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇద్దరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. బీజేపీ నేతలతో చర్చలు కూడా పూర్తయ్యాయనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్.. అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇంటికి వెళ్లారు. అక్కడే లంచ్ చేశారు. పొంగులేటీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి తుమ్మలతోనూ చర్చించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీనియర్ నేతలకు కేటీఆర్ హామీ ఇచ్చారు. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఎవరిని వదులుకోదని.. టికెట్లు రాకున్నా.. మరోమార్గంలో గౌరవం కల్పిస్తామని ఓపెన్ గానే చెప్పారు కేటీఆర్. పొంగులేటి పార్టీ మారుతున్నారని తెలియడంతోనే.. అతనితో మాట్లాడటం కోసమే కేటీఆర్ ఖమ్మం టూర్ ప్లాన్ చేసుకున్నారనే టాక్ కూడా ఉంది.

ఇక పాలమూరు గులాబీ పార్టీలోనే రచ్చ సాగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జూపల్లిపై.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. తర్వాత బీరం కారెక్కారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. బీరం, జూపల్లి వర్గీయులు చాలాసార్లు బహిరంగంగానే దాడులకు దిగారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన జూపల్లి  కారు పార్టీకి బైబై చెప్పనున్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాలను పూర్తిగా దూరంగా ఉండటంతో రేపోమాపో జెండా మార్చేడయం ఖాయమని అనుకున్నారు. కాని శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. ప్రభుత్వ కార్యక్రమం తర్వాత కొల్లాపూర్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లారు.జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా కేటీఆర్ తో పాటు జూపల్లి ఇంటికి వెళ్లారు. జూపల్లితో చర్చలు జరిపారు కేటీఆర్. పార్టీలోనే ఉండాలని.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని కేటీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే జూపల్లి నివాసానికి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం వెళ్లలేదు.

అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న కేటీఆర్ తీరుతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ సాగుతోంది. ఓటమి భయం వల్లే సీనియర్లు పార్టీ మారకుండా కేటీఆర్ చూస్తున్నారని అంటున్నారు. పార్టీ నిర్వహించిన సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు రావడం వల్లే టీఆర్ఎస్ హైకమాండ్ దిగొచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టిందని చెబుతున్నారు. అందుకే గతంలో ఎవరిని పట్టించుకోనే కేసీఆర్ కూడా స్వయంగా నేతలతో మాట్లాడుతున్నారని.. తాయిలాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

Read also: Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పురోగతి..పలువురు నిరసనకారుల అరెస్ట్..!

Read also: అమాయకులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారు..డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News