'పద్మావత్'పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు కురిపించారు. సినిమాలు అనేవి ఏ ఒక్కరి మనోభావాలు కించపర్చేవిగా వుండకూడదన్న ఆయన.. పద్మావత్ లాంటి సినిమాలు రాకూడదు అని అభిప్రాయపడ్డారు. ఇవాళ పద్మావత్ సినిమా విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పద్మావత్ వివాదంపై స్పందిస్తూ దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమా రాజ్‌పుత్ కర్ణిసేన వర్గాన్ని కించపర్చేలా వుండటాన్ని దిగ్విజయ్ తప్పుపట్టారు.


సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన పద్మావతి సినిమా అల్లర్లు, ఆందోళనల మధ్యే ఇవాళ థియేటర్లలోకొచ్చింది. అయితే, ఈ సినిమా విడుదలను మొదటినుంచి వ్యతిరేకిస్తున్న కర్ణిసేన వర్గాలు హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ బస్సుకు నిప్పంటించి తమ నిరసన తెలిపాయి. సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లపై ఆందోళనకారులు రాళ్లు విసిరి ప్రేక్షకులని భయకంపితులని చేశారు.