FIR on Twitter: ఇండియాలో ట్విట్టర్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ట్విట్టర్‌పై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్ని మరో దేశంగా చిత్రీకరించినందుకు కేసు ఎదుర్కోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ట్విట్టర్‌కు(Twitter) ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త ఐటీ నిబంధనల్ని అనుసరించకుండా కేంద్రం నుంచి నోటీసులు ఎదుర్కొన్న ట్విట్టర్‌కు మరో ఇబ్బంది ఎదురైంది. ఇటీవల ట్విట్టర్ విడుదల చేసిన భారత్ మ్యాప్‌లో జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్ని వేరేదేశంగా( Wrong Mapping India)చూపిస్తూ మహా తప్పిదం చేసింది. పర్యవసానంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ట్వీప్ లైఫ్ పేరిట ఉన్న పేిలో కెరీర్ సెక్షన్ ట్యాబ్‌లో ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించింది. దీంతో నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో కాస్సేపట్లోనే ఆ మ్యాప్‌ను ట్విట్టర్ తొలగించింది. గతంలో లేహ్‌(Leh)ను చైనాలో అంతర్భాగంగా చూపించి తప్పు చేసింది. ఇప్పుడు జమ్ముకశ్మీర్, లడఖ్‌లను తప్పుగా చూపించింది. ఫలితంగా ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిపై యూపీలో ఎఫ్ఐఆర్ నమోదైంది.


కొద్దిరోజుల క్రితమే కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసి..తిరిగి పునరుద్ధరించింది. ఇప్పటికే కొత్త ఐటీ నిబంధనలతో(New IT Rules) కేంద్ర ప్రభుత్వంతో(Central government)ఘర్షణ కొనితెచ్చుకున్న ట్విట్టర్ ..మరో తప్పుతో ఇరకాటంలో పడింది.


Also read; Twitter shows wrong map of India: ట్విటర్ ఎక్స్‌ట్రాలు.. జమ్మూకశ్మీర్, లడఖ్‌‌ని వేరే దేశాలుగా గుర్తింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook