Fire Accident in Ahmed Nagar District hospital: మహారాష్ట్ర(Maharastra)లోని అహ్మద్​నగర్​ జిల్లా ఆసుపత్రి(Ahmed Nagar Distrcit hospital)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూ(ICU)లో మంటలు చెలరేగి ఆరుగురు కరోనా రోగులు(Covid-19 Patients) ప్రాణాలు విడిచారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో 17 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Tragedy on Diwali: స్కూటీలో టపాసులు తీసుకెళ్తుండగా భారీ పేలుడు.. తండ్రి, కొడుకు మృతి


 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు పేర్కొన్నారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మంటలు చెలరేగిన క్రమంలో.. నర్సులు, వార్డు బాయ్స్​, వైద్యులు.. రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.  ఐసీయూలో మంటలు చెలరేగిన క్రమంలో ఆసుపత్రి మొత్తం పొగ కమ్మేసింది. తమ వారి పరిస్థితిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఐసీయూ(ICU)లో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook