400 మంది కార్మికులు పనిచేస్తున్న ఓ చిప్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం ఓ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో చిప్స్ ఫ్యాక్టరీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపలే ఉన్న కార్మికులను సిబ్బంది సురక్షితంగా బయటికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"175641","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఫ్యాక్టరీలో ఉన్న వస్తు సామాగ్రి, నిల్వలు అన్నీ చిప్స్ తయారికి సంబంధించినవి కావడంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ బయట స్టాక్ తరలించడానికి సిద్ధంగా ఉన్న పలు లారీలు సైతం కాలి బూడిదైనట్టు తెలుస్తోంది.


[[{"fid":"175642","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు.