First bird flu death case: బర్డ్ ఫ్లూతో బాలుడు మృతి.. దేశంలో తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ
First bird flu death case reported in india: ఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా బర్డ్ ఫ్లూతో మరణం సంభవించింది. బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి చికిత్స అందించిన వైద్య బృందంలో ఎవరికైనా, ఏవైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు (Bird flu symptoms in humans) కనిపిస్తే తక్షణమే తెలియచేయాల్సిందిగా ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ వారికి సూచించారు.
First bird flu death case reported in india: ఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా బర్డ్ ఫ్లూతో మరణం సంభవించింది. బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. బాలుడికి చికిత్స అందించిన వైద్య బృందంలో ఎవరికైనా, ఏవైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు (Bird flu symptoms in humans) కనిపిస్తే తక్షణమే తెలియచేయాల్సిందిగా ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ వారికి సూచించారు.
ఢిల్లీలో బర్డ్ ఫ్లూతో బాలుడి మృతి (Boy died of bird flu virus) ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన సుశీల్ అనే పదకొండేళ్ల బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో బాధపడుతూ ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. బాలుడికి కరోనావైరస్ పరీక్షలు చేయగా అందులో నెగటివ్ అని తేలింది. దీంతో వ్యాధి నిర్థారణ కోసం ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం బాలుడి శాంపిల్స్‌ను పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు (NIV in Pune) పంపించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిపిన పరీక్షల్లో బాలుడు బర్డ్ ఫ్లూతో బాధపడుతున్నట్టు నిర్థారణ అయింది.
Also read: Norovirus cases: లండన్‌లో నోరోవైరస్, గణనీయంగా పెరుగుతున్న కేసులు
బాలుడికి బర్డ్ ఫ్లూ నిర్థారణ అవడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఓ వైద్య బృందం వెంటనే బాలుడి స్వగ్రామానికి వెళ్లి ఆ బాలుడికి బర్డ్ ఫ్లూ ఎలా సోకిందనే కోణంలో విచారణ చేపట్టింది. ఇదిలావుండగా.. తాజాగా ఆ బాలుడు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి (Boy infected with bird flu dead) చెందాడు.
కేవలం పక్షులు, కోళ్లలో మాత్రమే కనిపించే బర్డ్ ఫ్లూ వైరస్ ఇలా ఓ మనిషికి సోకడం దేశంలో ఇదే తొలిసారి. గతంలో చైనాలోని ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు (Bird flu infection in humans) వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Also read : World Corona Update: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా వైరస్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook