World Corona Update: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. 2020 లో ప్రారంభమైన కరోనా వైరస్ దాదాపు మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడు మరోసారి ప్రపంచదేశాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఏ దేశంలో ఎన్ని కేసులున్నాయో ఇప్పుడు చూద్దాం.
2019 నవంబర్ నెలలో చైనా వుహాన్ (Wuhan)నుంచి ప్రారంభమైన కరోనా వైరస్..2020 జనవరి నుంచి నెమ్మదిగా అన్ని దేశాలకు విస్తరించడం ప్రారంభమైంది. 2020 మార్చ్-ఏప్రిల్-మే నెలల్లో అగ్రదేశాలతో సహా చాలా దేశాలు కరోనా బారిన పడి విలవిల్లాడాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఈ ఏడాది ప్రారంభంలో కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టేసింది. ముఖ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) భయం వెంటాడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక కరోనా కేసులు నమోదైన దేశాల గురించి ఓసారి తెలుకుందాం.ఇక గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 4,75,282 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 19,10,83,868కు చేరుకున్నాయి. ఇక కరోనా బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 41,03,278 మంది ప్రాణాలు కోల్పోయారు.
అగ్రరాజ్యం అమెరికా(America)లో ఇప్పటి వరకూ 3 కోట్ల 49 లక్షల 53 వేల 937 కేసులు నమోదు కాగా..గత 24 గంటల్లో 24 వేల 81 కేసులు వెలుగు చూశాయి. ఇక రెండవ స్థానంలో ఉన్న ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 11 లక్షల 6 వేల 65 కాగా..గత 24 గంటల్లో 38 వేల కేసులు నమోదయ్యాయి. మూడవ స్థానంలో నిలిచిన బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 93 లక్షల 42 వేల 448 కాగా..గత 24 గంటల్లో 34 వేల 339 కేసులు నమోదయ్యాయి. నాలుగవ స్థానంలో రష్యా నిలిచింది. ఈ దేశంలో మొత్తం 59 లక్షల33 వేల 115 కాగా..గత 24 గంటల్లో 25 వేల 116 కేసులు రిజిస్టరయ్యాయి. ఐదవ స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌లో మొత్తం కేసుల సంఖ్య 58 లక్షల 55 వేల 198 కాగా..గత 24 గంటల్లో 19 వేల 949 కేసులు నమోదయ్యాయి. ఇక టర్కీ, యూకే, అర్జెంటీనా, కొలంబియా, ఇటలీ దేశాలు 6 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి.
Also read: Danish Siddique: దానిష్ సిద్ధీఖ్ మరణానికి కారణం తాము కాదంటున్న తాలిబన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook