first mpox case detected in delhi: భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది.  ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో ఈ వైరస్ .. శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి ఒక వ్యక్తి భారత్ కు వచ్చాడు. అతడికి టెస్టులు చేయగా.. మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలీత ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది. మంకీపాక్స్ వైరస్ నేపథ్యంలో.. జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ సింప్టమ్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అతన్ని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో సైతం .. ఉంచడం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్లు జరిపిన టెస్టులలో.. సదరు వ్యక్తిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉనికిని నిర్ధారించిందని తెలిపింది.


ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్ సోకిన వ్యక్తి..  Mpox తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి మనందేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ సదుపాయంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. మంకీపాక్స్  కేసు నమోదు కావడంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది.


Read more: Radhika merchant: అంబానీ కోడలా.. మజాకా.. తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన రాధిక మర్చంట్.. వీడియో వైరల్..


ఎయిర్‌పోర్టులు, ఓడరేపులు .. ఇతర మార్గాల ద్వారా..   దేశంలోకి ప్రవేశించే వారిని టెస్టులు చేసిన తర్వాతే.. మన దేశంలోకి వచ్చేందుకు అనుమతించాలని కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అలాగే మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్‌, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలీత ప్రాంతాల్ని  సైతం కేంద్ర ఆరోగ్య శాఖ.. అప్రమత్తం చేసింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.