Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. భద్రతా బలగాలపై జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ముకశ్మీర్‌లోని(Jammu kashmir)పూంఛ్ సెక్టార్‌లో భారత ఆర్మీ సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు సూరంకోట్‌లోని డీకేజీ సమీపంలోని గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ముగ్గురి నుంచి నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్టు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జేసీఓతో పాటు నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఐదుగురినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్(Search Operation)ఇంకా కొనసాగుతోంది. 


Also read: Ys Jagan Review on Education Sector: రాష్ట్రంలో ప్రతి స్కూల్‌కు సీబీఎస్ఈ గుర్తింపు తప్పనిసరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook