Five State Elections 2023: దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మిజోరాం కౌంటింగ్ రేపు జరగనుండగా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ కౌంటింగ్ ఆసక్తి రేపుతోంది. కొన్ని చోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. కొంత ఉత్కంఠ నెలకొనడంతో ఏం జరుగుతందోననే ఆసక్తి రేగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా కన్పిస్తోంది. ఉదయం పది గంటల వరకూ ఫలితాల్ని పరిశీలిస్తే ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ గట్టిగా ఉండనుంది. ఛత్తీస్‌గఢ్‌లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకో ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. కానీ ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 46, బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 


ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనా. కానీ అందుకు విరుద్ధంగా బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీ ఏకంగా 140 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్  86 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. 


ఇక తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ 49 స్థానాల్లో, కాంగ్రెస్  62 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 6  స్థానాల్లో, మజ్లిస్ పార్టీ 4 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.


ఇక రాజస్థాన్‌లో ఊహించినట్టే అక్కడి సంప్రదాయానికి ఎగ్జిట్ పోల్స్‌కు తగ్గట్టే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 200 స్థానాల్లో బీజేపీ 115 స్థానాల్లోనూ, కాంగ్రెస్  72 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. 


Also read: Rajasthan Election Results 2023: రాజస్థాన్‌లో ఆధిక్యంలో బీజేపీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook