Rajasthan Election Results 2023: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగగా మిజోరాం మినహా మిగిలిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల కౌంటింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గడ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉంటే రాజస్థాన్‌లో బీజేపీ, ఎంపీలో హోరాహోరీ పోరు నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 101 స్థానాలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకు ఎదురుగాలి వీస్తోంది. రాజస్థాన్‌లో 9 గంటల వరకూ అందిన ఫలితాల్ని విశ్లేషిస్తే బీజేపీ 98 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 4 స్థానాల్లో మెజార్టీలో ఉన్నారని తెలుస్తోంది.
అయితే అధికార కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌పై అంతగా వ్యతిరేకత కూడా లేదు. ఎందుకంటే రెండు పార్టీల మధ్య తేడా తక్కువే ఉంది. వాస్తవానికి రాజస్థాన్ లో ప్రతి ఐదేళ్లకు అధికార మార్పిడి చేయడం ప్రజలకు బాగా అలవాటు. ఇప్పటి వరకూ అంటే గత 30 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వాన్నీ వరుసగా రెండుసార్లు గెలిపించలేదగు. తమిళనాడు తరహాలోనే ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది. అయితే రాజస్థాన్‌లో అధికార మార్పిడిపై కొనసాగుతున్న సంప్రదాయానికి విరుద్ధంగా తాము చేపట్టిన సంక్షేమ పధకాలు గెలిపిస్తాయని ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook