Assam Floods 2022: వరుణ బీభత్సానికి అసోం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగం..నీటిలోనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తాజాగా ముగ్గురు మరణించారు. వరదల బారిన పడి మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బర్పేట, దరంగ్, హైలాకిండి, కరీంగన్‌, సోనీట్‌పూర్ జిల్లాల్లో తాజాగా ఈ మరణాలు సంభవించాయి. గత ఐదు రోజుల్లో వరదలు, వర్షాలు, కొండచరియలు కారణంగా అసోంలో మరణించిన వారి సంఖ్య 60కు చేరింది.


అసోంలోని 32 జిల్లాల్లోని 4 వేల 296 గ్రామాలకు చెందిన 30 లక్షల 99 వేల 762 మందిపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. మొత్తం 514 పునరావాస శిబిరాల్లో లక్షా 56 వేల 365 మంది తలదాచుకుంటున్నారు. 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది. క‌ల్వ‌ర్టులు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.


ప్రమాదకరంగా నదులు :


బ్రహ్మపుత్రా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. జోరట్‌లోని నెమాటిఘాట్, సోనిట్‌పూర్‌లోని తేజ్‌పూర్‌ , దూబ్రీ జిల్లా కేంద్రం వద్ద ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది.ఇక కొపిలీ, మానస్‌, బేకీ, బెరక్, కౌనియారా నదుల్లోని నీటి మట్టం డేంజర్‌ లెవల్‌ను దాటాయి. నదీ పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.


మేఘాలయాలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. ప్రకృతి ప్రకోపానికి మేఘాలయాలో 19 మంది మరణించారు. చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక త్రిపుర రాజధాని అగర్తలాను భారీ వరదలు ముంచెత్తాయి. అగ‌ర్తలాలో 60 ఏళ్ల త‌ర్వాత మూడ‌వ అత్య‌ధిక వ‌ర్షం పాతం న‌మోదైంది. ఆ నగరంలో  6 గంట‌ల్లోనే 145 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌ం కురిసింది. ఆకస్మిక వరదలు ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.


Read also: Rain Alert: తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు


Read also: Record Rainfall : ఈశాన్యంలో కుండపోత వర్షాలు.. చిరపుంచి రికార్డ్ బ్రేక్.. మాసిన్రాంలో 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook