ఎట్టకేలకు బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా, మాజీ బొగ్గు కార్యదర్శి హెచ్.సి. గుప్తాలకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానము శనివారం మూడేళ్లు జైలు శిక్షవిధించింది. శిక్షతో పాటు మధుకోడాకు రూ. 25 లక్షల రూపాయల జరిమానా, హెచ్.సి. గుప్తాకు లక్ష రూపాయల జరిమానా విధించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్(విఐఎస్యుఎల్) ప్రవేట్ కంపెనీకి జార్ఖండ్ లోని రాజ్హరా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపులో అవినీతి పద్దతులు, నేరపూరిత కుట్రకు పాల్పడినందుకు కోడా, గుప్తాతో సహా జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.కె.బసు, విజయ్ జోషిలకు కూడా మూడేళ్లు జైలు శిక్ష ఖరారు చేశారు.  ప్రత్యేక న్యాయమూర్తి భారత్ పరశర్  ప్రైవేటు సంస్థను దోషిగా నిర్ధారించి, రూ.50 లక్షల జరిమానా విధించారు.


అయితే, కోడాతో సహా ఖైదీలు రెండు నెలల వ్యవధిలో చట్టబద్దమైన బెయిల్ మంజూరు చేశారు. దీంతో వారు ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసి, జైలు శిక్షను సవాలు చేస్తారు.


సంస్థ, జనవరి 8, 2007న రాజ్హరా నార్త్ బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం దరఖాస్తు చేసినట్లు సీబీఐ పేర్కొంది. జార్ఖండ్ ప్రభుత్వం, ఉక్కు మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల కేటాయింపు కోసం విఐఎస్యుఎల్ ను సిఫారసు చేయలేదు. 36 వ స్క్రీనింగ్ కమిటీ ఈ బ్లాక్ ను సిఫారసు చేసిందన్నారు. 


స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న గుప్తా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద, బొగ్గు మంత్రిత్వ శాఖ వద్ద వాస్తవాలను దాచిపెట్టాడని, బొగ్గు శాఖ కేటాయింపు కోసం జార్ఖండ్ విఐఎస్యుఎల్ ను సిఫార్సు చేయలేదని సీబీఐ పేర్కొనింది.