Former Kerala chief minister Oommen Chandy dies:  కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్‌ చాందీ కన్నుమూశారు. 79 ఏళ్ల ఊమెన్‌ చాందీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గొంతు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధృవీకరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊమెన్‌ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వెనుదిరుగు చూసుకోలేదు. పూతుపల్లి నియోజకవర్గం నుంచే 12సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఊమెన్‌ చాందీ ఏనాడూ పార్టీ మారలేదు. అంతేకాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు.


Also Read: Sonia Gandhi's dance video: హరియాణా మహిళ రైతులతో సోనియా గాంధీ డాన్స్ వీడియో వైరల్‌


''మన అత్యంత ప్రియమైన నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. కేరళలోని అత్యంత జనాదరణ పొందిన మరియు డైనమిక్ నాయకులలో ఆయన ఒకరు'' అని కాంగ్రెస్ కేరళ ట్వీట్ చేసింది. 



Also Read:  Fire in Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, మధ్యప్రదేశ్ లో ఘటన..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook