Pratibha Patil: ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్.. అసలేం జరిగిందంటే..?
Pune Bharati Hospital: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణే నగరంలోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా ఆమె జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అనేక బ్లడ్, ఛాతీకి సంబంధించిన టెస్టులు చేసినట్లు సమాచారం.
Ex President Pratibha Patil Hospitalised: మన దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా సేవలందించిన ప్రతిభా పాటిల్ ఆస్సత్రిలో చేరారుక. ఆమె పూణేలోని భారతీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. కొన్నిరోజులుగా.. తీవ్ర మైన జ్వరం, ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తరపు బంధువులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వైద్యులు ఆమెను ప్రత్యేకంగా టెస్టులు చేసినట్లు సమాచారం. రిపోర్టుల వచ్చిన తర్వాత తదుపరి వైద్య సేవలు అందించనున్నారు.
ఇప్పటికైతే ప్రతిభా పాటిల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రతిభాపాటిల్ ఆస్పత్రిలో చేరిన వార్త వెలుగులోకి రావడంతో అనేక మంది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా పాటిల్ హెల్త్ వివరాల గురించి ఆరా తీస్తున్నారు. భారత్ కు ప్రతిభాపాటిల్ 12 వ రాష్ట్రపతిగా, తొలి మహిళా రాష్ట్రపతిగా కూడా సేవలందించారు. ఆమె 2007 నుంచి 2012 వరకు సేవలు అందించారు. అదే విధంగా 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్ గా కూడా సేవలందించారు.
Read More: White Hair: టీనేజ్ లోనే వెంట్రుకలు తెల్లబడ్డాయా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..
Read More: Viral Video: చేప ప్రాణాలను కాపాడిన కొంగ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter